31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
రెండు రోజుల పాటు జరిగిన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలతో పాటు మేథోమథనం కూడా జరిగింది
• వచ్చే ఏడాది నిర్వహించే సదస్సుకు కూడా పారిశ్రామిక వేత్తలను ఇప్పుడే సీఎం చంద్రబాబు ఆహ్వానించటం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ వేర్వేరు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి
• విభజన గాయాలతో ఇబ్బందులు పడినా ఇప్పుడు అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోంది
• 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడిని ఏపీ ఆకర్షించటం అసాధారణం
• వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధన వైపు ఏపీ నడుస్తోంది
• పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఎలక్ట్రానిక్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం లాంటి రంగాల్లో పెట్టుబడుల్ని ఆకట్టుకుంటోంది
• ప్రతీ సంక్షోభ సమయంలో అంతే స్థాయిలో అవకాశాలను కూడా తీసుకువస్తుంది
• ఈ సమయంలో భారత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది
• ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకునేలా దేశం ముందుకు వెళ్తోంది.
• గ్రోత్ ఇంజిన్లుగా వేర్వేరు రంగాలు అభివృద్ధి పథంలో వెళ్తున్నాయి
• సమీప భవిష్యత్తులో టెక్నాలజీ రంగమే ఓ డ్రైవింగ్ ఫోర్సుగా నిలుస్తుందనటంలో సందేహం లేదు
• ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీని పాలన, పౌరసేవల కోసం వినియోగించటం అభినందనీయం
• డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాను తయారు చేయటం ఓ కీలకమైన అంశంగా మారుతుంది
• మన తయారీ రంగంతో పాటు దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా సిద్ధం కావాలి
• దేశం ఓ బలమైన ఆర్ధిక శక్తిగా ఎదగడానికి అవసరమైన రంగాలపై మనం అంతా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
• ఈ సమయంలోనే ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలి
• మానవ వనరుల నైపుణ్యాలను పెంచుకుని భారతీయ మేధోసంపత్తిని ప్రపంచానికి చాటాలి
• ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా రంగం, ఆవిష్కర్తలు ఒక్కతాటిపైకి వచ్చి భారత్ ట్రాన్సఫర్మేషన్ కోసం పనిచేయాలి
• కోవిడ్ సమయంలో ఆవిష్కరించి, ఉచితంగా ఇచ్చిన వాక్సిన్ 100 దేశాలకు ప్రాణం పోసింది… భారత్ సత్తా చాటింది
• సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అతిథులకు అందరికీ అభినందనలు
• ఒప్పందాల నుంచి అభివృద్ధి లక్ష్యాల వైపు అంతా ముందుకు వెళ్లాల్సి ఉంది
• వర్క్ టుగెదర్, గ్రో టుగెదర్, షేర్ ప్రాస్పెరిటీ అనే విధానంలో పనిచేద్దామని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాను