Home UncategorizedVizagvision :

Vizagvision :

by Deva Trinadh Rao

ఆగస్ట్ 1, 2026 న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వేడుకలో భాగంగా 13,000 నుండి 14,000 మంది గిరిజన విద్యార్థినులతో భారీ సాంప్రదాయ దింసా (థింసా) నృత్య ప్రదర్శన నిర్వహించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ప్రారంభోత్సవ వేడుక మరియు గిన్నిస్ రికార్డ్ విశేషాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణ, విజయనగరం జిల్లాప్రధాన ఆకర్షణ: ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతిని చాటిచెప్పేలా సుమారు 13,000 నుంచి 14,000 మంది గిరిజన బాలికలు, విద్యార్థినులతో ఏకకాలంలో భారీ దింసా నృత్య ప్రదర్శన.
గిన్నిస్ ప్రయత్నం: దేశంలోనే అతిపెద్ద దింసా నృత్య ప్రదర్శనగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

You may also like

Leave a Comment