Home UncategorizedVizagvision Visakapatnam:

Vizagvision Visakapatnam:

by Deva Trinadh Rao

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం

పారిశ్రామిక ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇస్తూ ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధులు, విదేశీ రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నాను
• దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖను గుర్తిస్తూ కేంద్రం ప్రకటించింది.
• గిరిజన ధింసా లాంటి నృత్యంతో పాటు ఏపీ సంస్కృతీ సంప్రదాయాలతో అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం ఇది
• రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సోలార్ వేఫర్స్, సౌర ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ లాంటి అంశాల్లో ఏపీ పనిచేస్తోంది
• క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో అత్మనిర్భరతా, అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు కోసం స్పేస్ విజన్, సెమికండక్టర్ మిషన్ , లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం,గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ మిషన్స్‌ను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించాం
• క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుతో పాటు క్వాంటం పరికరాలను మేడ్ ఇన్ అమరావతి ముద్రతో తయారు చేస్తాం
• పౌర అవసరాలు, డిఫెన్స్ అప్లికేషన్ల కోసం డ్రోన్లను తయారు చేసేందుకు డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం
• ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను రవాణా చేస్తున్నాం
• ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా ప్రపంచానికి హార్టీకల్చర్ హబ్‌గా ఏపీని మారుస్తాం
• 12 ఎక్స్ స్పీడ్ ఆఫ్ అప్రూవల్స్‌తో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం
• 303 ఎంఓయూల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
• ఈ సదస్సుతో కలిపి ఏపీ రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది.

You may also like

Leave a Comment