Home UncategorizedVizagvision Visakhapatnam :విశాఖపట్నం – పార్వతీపురం – విశాఖపట్నం మధ్య మెము ప్రత్యేక రైళ్ల నిర్వహణ (07268/07267)విశాఖపట్నం – పార్వతీపురం – విశాఖపట్నం మధ్య మెము ప్రత్యేక రైళ్ల నిర్వహణ (07268/07267)

Vizagvision Visakhapatnam :విశాఖపట్నం – పార్వతీపురం – విశాఖపట్నం మధ్య మెము ప్రత్యేక రైళ్ల నిర్వహణ (07268/07267)విశాఖపట్నం – పార్వతీపురం – విశాఖపట్నం మధ్య మెము ప్రత్యేక రైళ్ల నిర్వహణ (07268/07267)

by Deva Trinadh Rao

వారాంతపు రోజులు మరియు దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని నివారించి, వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించే ఉద్దేశంతో విశాఖపట్నం డివిజన్, దక్షిణ కోస్తా రైల్వే రైల్వే, విశాఖపట్నం (VSKP) – పార్వతీపురం (PVP) మధ్య ప్రత్యేక మెము రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

1. విశాఖపట్నం – పార్వతీపురం ప్రత్యేక మెము రైలు (07268):

రైలు నంబర్ 07268 విశాఖపట్నం – పార్వతీపురం ప్రత్యేక మెము రైలు 07.11.2026 నుండి 09.11.2026 వరకు మూడు ట్రిప్పులు నడుస్తుంది. ఈ రైలు విశాఖపట్నం నుంచి ప్రతిరోజూ ఉదయం 10:00 గంటలకు బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12:25 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.

2. పార్వతీపురం – విశాఖపట్నం ప్రత్యేక మెము రైలు (07267):

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07267 పార్వతీపురం – విశాఖపట్నం ప్రత్యేక మెము రైలు 07.11.2026 నుండి 09.11.2026 వరకు మూడు ట్రిప్పులు నడుస్తుంది. ఈ రైలు పార్వతీపురం నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12:35 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 16:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

మార్గమధ్యంలోని నిలుపుదల స్టేషన్లు

ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం – పార్వతీపురం మధ్య ఇరు మార్గాల్లో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం మరియు నర్సిపురం హాల్ట్ స్టేషన్లలో ఆగుతాయి.

ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ తీర రైల్వే విజ్ఞప్తి చేస్తోం

You may also like

Leave a Comment