6



సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఎంఓయూల కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు



- ఒప్పందాలు చేసుకోవటంతో పాటు ప్రాజెక్టులు గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి సూచన
- ప్రాజెక్టులు గ్రౌండ్ చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించిన సీఎం
- ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
- బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్‌షిప్ ను 1120 మంది విద్యార్ధులకు ఆర్ధిక సహకారం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ముందుకు రావటం సంతోషదాయకం
- ఐటీసీ కూడా సామాజిక బాధ్యతగా పీ4కు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను
- 25 వేల మంది బంగారు కుటుంబాలకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు.
- ప్రధాని మోదీలాంటి వ్యక్తులు కూడా అత్యంత పేదకుటుంబంలో నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగారు
- స్పేస్ సెక్టార్ కోసం తిరుపతి వద్ద 5 వేల ఎకరాలను సిద్ధంగా ఉంచాం. స్పేస్ డిఫెన్స్ రంగంలోని పరిశ్రమలకు ఈ ప్రాంతం అనుకూలం
- ఆధునిక సాంకేతిక పరికరాలు రోజురోజుకూ మన జీవితాన్ని మార్చేస్తున్నాయి. దానికి అనుగుణంగా మన ఆలోచనలూ మారాల్సి ఉంది
- సెమికండక్టర్లు, ఏఐ, క్వాంటం, ఏరోస్పేస్ ఇలా వేర్వేరు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆస్కారం ఉంది
- దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ ల లాంటి విద్య సంస్థలు ముందుకు వచ్చి ఏపీని ప్రయోగశాలగా మార్చుకుని పరిశోధనలు చేయాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని కోరుతున్నాను
- పెట్టుబడులు వస్తేనే దేశానికి, మన సమాజానికి సంపద సృష్టించగలం, రాజకీయ నేతగా దీనిపై నేను దృష్టి పెట్టాను.
- సంపద సృష్టితో పాటు పేదల జీవన ప్రమాణాలు కూడా పెంచాల్సి ఉంది. విద్య, వైద్యం, ఆర్ధిక, సామాజిక స్థితులను మెరుగు పరచాలి
- అందుకే పీ4 కార్యక్రమం తీసుకువచ్చి వారి జీవన ప్రమాణాలను మార్చేందుకు చేయూత అందించేందుకు ప్రయత్నిస్తున్నాం
- ఇటీవల ఒపీ జిందాల్ యూనివర్సిటీ యాక్సెస్ టూ ఈక్వాలిటీ ఇండెక్స్ లో ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉందని తేల్చి చెప్పింది.
- ఆర్ధిక సవాళ్లు ఉన్నప్పటికీ ఆర్ధిక సామాజిక భద్రతను ప్రజలకు అందించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది
- పీ4 ఉద్యమంలో పాల్గొనాలని పారిశ్రామిక వేత్తలు అందరికీ పిలుపునిస్తున్నాను.
- టీవీఎస్ కంపెనీ కుప్పంలో ఇటీవల ఓ ఇటుక తయారీ కార్మికురాలికి చేయూత అందించి ఆమెను ఇటుకబట్టీ యజమానిగా మార్చింది.
- ఇప్పుడు ఆ పేద మహిళ మరో 20 మందికి జీవనోపాధి అందించే వ్యాపారవేత్తగా మారింది. ఇలాంటి విజయగాథలే అంతటా వినిపించాలి.
- అవసరం ఉన్న వ్యక్తులకు సంపద అందింతేనే ఆ సంపదకు విలువ ఉంటుందన్నది మనం అంతా గుర్తించాలి
- ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ కుటుంబం హ్యాపీ, హెల్తీ వెల్తీగా ఉండాలన్నదే నా నిరంతర తాపత్రయం