Home UncategorizedVizag Vision Visakhapatnam : శంకర్ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందనతొలిరోజే 500 మందికి కంటి పరీక్షలుఅగనంపూడి : ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా శంకర్ ఫౌండేషన్ సహకారంతో అగనంపూడి కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లో రెండు రోజుల సమగ్ర ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది.ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ శ్రీ రవి చంద్ర కట్టా ప్రారంభించారు. ఫైజర్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు, CWC ప్రతినిధులు మరియు శంకర్ ఫౌండేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరానికి అగనంపూడి మరియు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తొలిరోజే 500 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు శిబిరంలోనే కళ్లద్దాలను అందించే సదుపాయం కూడా కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ రవి చంద్ర కట్టా మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలకు ఫైజర్ నిరంతరం మద్దతు అందిస్తుందని తెలిపారు. నివారించగల అంధత్వాన్ని ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రజలు ఈ ఉచిత కంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు శ్రీ అరవింద్ జయరామన్ – EHS హెడ్, శ్రీ విజయ్ మహాజన్ – మాన్యుఫ్యాక్చరింగ్ హెడ్, శ్రీ రాజేష్ రావురి – ఫైనాన్స్ హెడ్, శ్రీ సత్జీత్ సింగ్ – IT హెడ్, శ్రీ ఎం.వి. రామరాజు – పబ్లిక్ అఫైర్స్ & CSR హెడ్, డా. పి. ఈశ్వర్ రావు – మెడికల్ ఆఫీసర్, శ్రీ జె. కిషోర్ – CSR, శ్రీమతి పవని – CSR, శ్రీ ఎస్.వి. నాగేశ్వరరావు – CSR, మరియు శ్రీ యు. శ్రీను పాల్గొన్నారు.శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ సమాజంలోని అవసరమైన వర్గాలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించేందుకు ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది ఇందుకు సహకరించిన ఫైజర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు..కార్యక్రమం గురించి శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు మాట్లాడుతూ, అగనంపూడి మరియు పరిసర గ్రామాల ప్రజల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. తొలిరోజే మొత్తం 500 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.శంకర్ ఫౌండేషన్కు చెందిన డా. సోమ్యశ్రీ సమల్ మరియు డా. డి. పావన ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించగా, 35 మంది వైద్య, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది శిబిరంలో సేవలందించారు.శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు CWC కమిటీ కార్యదర్శి శ్రీ కె. పైడిరాజు, శ్రీ వై. సాంబశివరావు, శ్రీ జి. అప్పారావు మరియు శ్రీ బి. సత్యనారాయణ సహకరించారు.శిబిరం రెండో రోజూ కొనసాగనుండటంతో, మరింత మంది ప్రజలు ఉచిత కంటి వైద్య సేవలను వినియోగించుకోవాలని శంకర్ ఫౌండేషన్ కోరింది.

Vizag Vision Visakhapatnam : శంకర్ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందనతొలిరోజే 500 మందికి కంటి పరీక్షలుఅగనంపూడి : ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా శంకర్ ఫౌండేషన్ సహకారంతో అగనంపూడి కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లో రెండు రోజుల సమగ్ర ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది.ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ శ్రీ రవి చంద్ర కట్టా ప్రారంభించారు. ఫైజర్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు, CWC ప్రతినిధులు మరియు శంకర్ ఫౌండేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరానికి అగనంపూడి మరియు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తొలిరోజే 500 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు శిబిరంలోనే కళ్లద్దాలను అందించే సదుపాయం కూడా కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ రవి చంద్ర కట్టా మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలకు ఫైజర్ నిరంతరం మద్దతు అందిస్తుందని తెలిపారు. నివారించగల అంధత్వాన్ని ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రజలు ఈ ఉచిత కంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు శ్రీ అరవింద్ జయరామన్ – EHS హెడ్, శ్రీ విజయ్ మహాజన్ – మాన్యుఫ్యాక్చరింగ్ హెడ్, శ్రీ రాజేష్ రావురి – ఫైనాన్స్ హెడ్, శ్రీ సత్జీత్ సింగ్ – IT హెడ్, శ్రీ ఎం.వి. రామరాజు – పబ్లిక్ అఫైర్స్ & CSR హెడ్, డా. పి. ఈశ్వర్ రావు – మెడికల్ ఆఫీసర్, శ్రీ జె. కిషోర్ – CSR, శ్రీమతి పవని – CSR, శ్రీ ఎస్.వి. నాగేశ్వరరావు – CSR, మరియు శ్రీ యు. శ్రీను పాల్గొన్నారు.శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ సమాజంలోని అవసరమైన వర్గాలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించేందుకు ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది ఇందుకు సహకరించిన ఫైజర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు..కార్యక్రమం గురించి శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు మాట్లాడుతూ, అగనంపూడి మరియు పరిసర గ్రామాల ప్రజల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. తొలిరోజే మొత్తం 500 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.శంకర్ ఫౌండేషన్కు చెందిన డా. సోమ్యశ్రీ సమల్ మరియు డా. డి. పావన ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించగా, 35 మంది వైద్య, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది శిబిరంలో సేవలందించారు.శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు CWC కమిటీ కార్యదర్శి శ్రీ కె. పైడిరాజు, శ్రీ వై. సాంబశివరావు, శ్రీ జి. అప్పారావు మరియు శ్రీ బి. సత్యనారాయణ సహకరించారు.శిబిరం రెండో రోజూ కొనసాగనుండటంతో, మరింత మంది ప్రజలు ఉచిత కంటి వైద్య సేవలను వినియోగించుకోవాలని శంకర్ ఫౌండేషన్ కోరింది.

by Deva Trinadh Rao

You may also like

Leave a Comment