రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక


- ప్రెసిడెంట్ గా చక్కా కామేశ్వరరావు
- సెక్రటరీగా కె ఎం కె రమేష్
- ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకార మహోత్సవం
రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. వాల్తేర్ క్లబ్ లో జరిగిన రోటరీ సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యుల వివరాలను పాస్ట్ డిస్టిక్ గవర్నర్ సిహెచ్. కిషోర్ కుమార్ ప్రకటించారు. క్లబ్ నూతన అధ్యక్షులుగా చక్కా కామేశ్వరరావు, కార్యదర్శిగా కె.ఎం.కె. రమేష్, కోశాధికారిగా ఏ. ప్రభు జనార్ధన్, ఎన్నికయ్యారు. క్లబ్ ఆఫీసర్స్ గా పి. భాస్కర్ నరేంద్ర జగన్ (ఉపాధ్యక్షులు), టి.కోటేశ్వరరావు (సహాయ కార్యదర్శి), ఎస్. కృష్ణకుమారి (ప్రెసిడెంట్ ఎలెక్ట్), చింతా నేతాజీ ( పాస్ట్ రిజర్వేషన్ ప్రెసిడెంట్), టి. సురేష్ (సర్జెంట్ ఎట్ ఆమ్స్), బి. బ్రహ్మానందం (క్లబ్ సర్వీస్), బి.దిలీప్ కుమార్ (ఒకేషనల్ సర్వీస్), డైరెక్టర్స్ గా డాక్టర్ అశోక్ దేవరకొండ (కమ్యూనిటీ సర్వీస్ మెడికల్), ఎండి.యాసిన్ (కమ్యూనిటీ సర్వీస్), జి.కే.మూర్తి (ఇంటర్నేషనల్ సర్వీస్) పి.రాజేష్ (యూత్ సర్వీస్) బి.శంకర్ రావు (స్పెషల్ ప్రాజెక్ట్), చైర్మన్లుగా పి. నాగరాజు (రోటరీ ఫౌండేషన్), ఫిరోజ్ ఖాన్ (పబ్లిక్ ఇమేజ్), బి.భాస్కర్ (మెంబర్షిప్), వి.మోహన్ రావు (అడ్మినిస్ట్రేషన్), మొల్లేటి శ్రీనివాసరావు (పోలియో చైర్), పీర్ మహమ్మద్ ( ఆన్ లైన్ టూల్స్), కె.కళ్యాణ్ చక్రవర్తి (లిటరసీ అండ్ హ్యాపీ స్కూల్స్), జి. వెంకట్ రామ్ (అటెండెన్స్ ప్రమోషన్), ప్రొఫెసర్ పి.వి.ఎల్. నారాయణ (రోటరేట్ అండ్ ఇంటరాక్ట్), బి.చందన (ఫెలోషిప్ క్లబ్), మెంటార్ గా పిడిజి సిహెచ్. కిషోర్ కుమార్, క్లబ్ సలహాదారులుగా డాక్టర్ టీవీఎస్ రావు, డాక్టర్ ఎం.ఎస్. రాజు వ్యవహరిస్తారు. ఈ నూతన కార్యవర్గం ఈనెల 12వ తేదీ హోటల్ ఫోర్ పాయింట్స్ లో జరగనున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2026-27 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ చేపట్టనున్న సమాజ సేవా కార్యక్రమాల్లో వీరంతా భాగస్వాములై కృషి చేస్తారు.