Vizagvision:

GM, South Coast Railway Conducts Intensive Inspection of Tirupati–Guntakal Section Sandeep Mathur, General Manager, South Coast Railway (SCoR), conducted an intensive inspection of major raiwlay stations in Guntakal Division including Tirupati Railway Station and the Tirupati–Guntakal section today. This marks his first inspection of the section following the formation of the new South Coast Railway Zone, aimed at reviewing infrastructure development, passenger amenities, and ongoing projects across the Zone.At Tirupati Railway Station, the General Manager reviewed the progress of the Station Redevelopment Project and inspected various passenger amenity and infrastructure works, including the circulating area, lifts, escalators, platforms, concourse, and other facilities. He interacted with construction officials and emphasized the importance of timely execution while maintaining high quality standards. Guntakal Division made a detailed presentation highlighting the status of ongoing projects, developmental activities, operational achievements, and future plans in the division.As part of the inspection, Shri Sandeep Mathur visited Razampeta Railway Station and reviewed developmental works in the circulating area, waiting hall, parking area, and other passenger facilities. At Kadapa Railway Station, the General Manager conducted a detailed inspection of the circulating area, platforms, and passenger amenities, with special focus on the progress of Amrit Bharat Station Scheme works. He assessed the quality of execution and reviewed ongoing infrastructure development activities, directing officials to ensure quality and timely completion of all projects.General Manager also carried out a window trailing inspection from Tadipatri to Gooty to assess track conditions, safety aspects, and ongoing works in the section. At Gooty, he inspected the yard remodelling works and advised officials to expedite completion. He further continued the inspection of railway infrastructure between Gooty and Guntakal through window trailing inspection.

Related posts

Vizagvision Visakhapatnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 వసంతాలు అయింది. త్యాగరాజ స్వామి భక్తుడైన సుసర్ల సూర్య భగవత్ శంకర శాస్త్రి గారు సంకల్పం విశాఖపట్నంలో ఒక సాంస్కృతిక కేంద్రం ఉండాలని అది నెరవేర్చే దిశలో శ్రీ సి.ఎస్.ఎన్. రాజుగారు, Dr. గోపాల్ శాస్త్రి గారు, శ్రీ డివి సుబ్బారావు గారు, శ్రీ వి.సీతారామయ్య గారు, శ్రీ Ch.V జోగారావు గారు ఇలాంటి పెద్దలు ట్రస్టుగా ఏర్పడి నిర్మించిన కళాక్షేత్రమే ఈ కళాభారతి. అప్పటినుంచి ఇప్పటివరకు కొన్ని వేల కచేరీలు, నృత్య కార్యక్రమాలు, నాటకాలు, సాహితీ కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, త్యాగరాజ ఉత్సవాలు , వాగ్దేయ కార్ల ఉత్సవాలు ఈ వేదికపై నిర్వహించడం జరిగింది. భారతరత్నలు, పద్మ విభూషణలు, పద్మభూషణలు, పద్మశ్రీలు, సంగీత కళానిధులు, ఇంకా ప్రపంచవ్యాప్తి చెందిన ప్రఖ్యాత కళాకారులు ఈ వేదికపై ప్రదర్శనలు ఇచ్చి విశాఖపట్నం ని కళాభారతి ద్వారా కళలకి కేంద్రం అయింది. విశాఖ వాసులందరికీ అటువంటి కళాకారుని పరిచయం చేసే భాగ్యం కళాభారతి ట్రస్ట్ వారికి దక్కింది అని కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు అన్నారు.ఈ సంవత్సరం నాలుగు దశాబ్దాలు నిండిన కళాభారతి సంగీత సేవకు అనుగుణంగా ఆరు రోజులు పాటు అత్యంత ఉన్నత స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని దానికి ముఖ్యఅతిథిగా ఒడిస్సా గవర్నర్ గారు H.E.శ్రీ కే హరి బాబు గారు 27వ తారీఖున జరగబోయే “నాట్య విద్యా భారతి” బిరుదు సత్కార సభకి ముఖ్యఅతిథిగా వస్తున్నారు అని మంతేనా సత్యనారాయణ రాజు అధ్యక్షులు తెలియజేశారు. అలాగే 26 వ తేదీన Vice Admiral Sanjay Bhalla ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు.ముందుగా ఆరు రోజుల ఉత్సవాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు MSN రాజు , కార్యదర్శి డాక్టర్ రాంబాబు , కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్, ట్రస్టీ మల్లికా మనోజ్ గ్రంథి , ట్రస్టీ శ్రీ ఎస్ రామగోపాల్ , పంతుల నర్సింగరావు & మేనేజర్ మోహన్ దాస్ ఆవిష్కరించారు.తర్వాత ప్రధాన కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ మొదట రోజు (22/8/2026) న ప్రఖ్యాత గాత్ర విద్వాంసరాలు ఈ వారంలోనే సంగీత నాటక అకాడమీ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మన విశాఖకే గర్వకారణమైన కళాకారిణి డాక్టర్ పంతుల రమ గారి గాత్ర కచేరితో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు రెండవ రోజున(23/8/2026) సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారధ్యంలో విజయవాడ వారు : “జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్” చారిత్రాత్మాక నాటకాన్ని 60 మంది కళాకారులతో అత్యంత భారీ సెట్టింగ్లతో ప్రదర్శించబోతున్నారని అన్నారు. మూడో రోజున (24/8/2026) ప్రఖ్యాత హిందుస్తానీ విద్వాంసులు ,ఢిల్లీ, కాశ్మీర్, కలకత్తా నుంచి వచ్చి హిందుస్తానీ గాత్ర & సరోద్ వాయిద్య జుగల్బంది కచేరి చేయబోతున్నారని అన్నారు. నాలుగవ రోజు(25/8/2026) ప్రపంచ ఖ్యాతిగాంచిన ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు త్రిచూర్ బ్రదర్స్ చెన్నై నుంచి వచ్చి అద్భుత కచేరి చేయనున్నారని అన్నారు .ఐదవ రోజున (26/8/2026) సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీ మైసూర్ మంజునాథ్, వారి కుమారుడు విద్వాన్ సుమన్ మంజునాథ్ కలిసి వైలెన్ ద్వయం కచేరి ఉంటుందని అన్నారు. ఆఖరి రోజున (27. 8 .2026) సాయంత్రం 6:30 గంటలకు విఎండిఏ ప్రతిస్టాత్మకంగా ఇచ్చే వార్షిక బిరుదు ప్రధానం “నాట్య విద్యా భారతి” బిరుదును 84 ఏళ్ల భరతనాట్య కళాకారిణి , పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం గారికి ప్రధానం చేయనున్నామని,, ముఖ్యఅతిథిగా H.E డాక్టర్ కే హరి బాబు గారు గవర్నర్ ఒడిశా వచ్చి వారి చేతుల మీదుగా ప్రధానోత్సవం జరుగుతుందని, అలాగే రెండున్నర లక్షలు విలువ చేసే వైభవ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేస్తున్న “స్వర్ణకమలం”, లక్ష రూపాయల నగదు బహుమతి ,ప్రశంసా పత్రం, నూతన వస్త్రాలు, కర్పూర మాలలతో పురస్కార గ్రహీతను ఘనంగా సత్కరించనున్నామని అన్నారు. పైన చెప్పిన ఆరు రోజుల కార్యక్రమాలు అత్యంత ఉన్నత స్థాయివని ఖర్చుక వెనకాడకుండా గొప్పవిద్వాంసులను ఆహ్వానించడం జరిగిందని సంగీత ప్రియులు, కళాకారులు , కళాభిమానులు ప్రతి ఒక్కరూ ఆరు రోజులు విచ్చేసి కార్యక్రమాలు వీక్షించి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు .ప్రతిరోజు రాత్రి భోజన రూపేనా ప్రసాదాలు ఏర్పాటు చేశామని కూడా అన్నారు .ఈ కార్యక్రమానికి బిరుదు ప్రధానోత్సవం రోజున(27/8/2026) జరిగే కార్యక్రమానికి S R K Infra Projects Pvt.Ltd chairman శ్రీ ఎం ఎస్ ఎం రాజు రెండున్నర లక్షలు స్పాన్సర్ చేస్తున్నారని , అదే రోజున మరొక రెండు లక్షల విలువ చేసే స్వర్ణకమలం వైభవ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేస్తున్నారని , నూతన వస్త్రాలు కంకటాల సిల్క్ వారు స్పాన్సర్ చేస్తున్నారని , ఈ కార్యక్రమాలు విజయానికి , శ్రీ సి ఎస్ ఎన్ రాజుగారు, శ్రీ డి ఎస్ ఎన్ రాజు ట్రస్ట్, MRC ప్రాజెక్ట్స్ మరియు కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ కే. రాంబాబు గారు అలాగే తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ కంపెనీవారు, పైడా కృష్ణ ప్రసాద్ గారు అన్నం రాజు సత్యనారాయణమూర్తి గారు ప్రాయోజకులుగా సహకారం అందిస్తున్నారని అన్నారు ఈ ఆరు రోజుల గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేరని మరొకసారి ఉద్ఘాటించారు.ప్రతిరోజు సాయంత్రం 6:30 కి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు.పత్రిక విలేకరుల అందర్నీ వారు చేస్తున్న కృషికి ప్రశంసిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని రామప్రసాదంగా అయోధ్య నుంచి వచ్చిన స్కార్ఫ్తో సన్మానించారు అధ్యక్ష కార్యదర్శులు మిగతా సభ్యులుశ్రీరామదాస డాక్టర్ రాంబాబు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ

Vizag Vision Visakhapatnam:గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్ శ్రీకృష్ణ విద్యా మందిర్, విశాఖపట్నంభారతీయ విద్యకు ప్రముఖ కేంద్రమైన శ్రీకృష్ణ విద్యా మందిర్ నందు నేడు “గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్”కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నాంది పలకడం జరిగింది.*ముఖ్య అతిథులు: *ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు*, చైర్మన్,శ్రీమతి ఈశ్వర ప్రభాకర గారు,శ్రీ సుబ్బారావు గారు*, భారతీయ విద్యా ప్రముఖులు,వి.వి.ఎన్ ఆచార్యులు గారు,బి. నారాయణ రావు గారు*, సమితి ముఖ్య ప్రముఖులు,శ్రీ చిరంజీవి గారు పాఠశాల ప్రిన్సిపల్ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. పాఠశాల విద్యార్థులు ప్రార్థనా గీతంతో సభను అలరించారు విజ్ఞాన మేళాలో *గణితం, సైన్స్, సంస్కృత బోధన*కు సంబంధించిన ప్రయోగాత్మక కార్యక్రమాలు మరియు *మట్టి బొమ్మల తయారీ* కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి.విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ మేళా మూడు స్థాయిలలో నిర్వహించబడుతుంది. పాఠశాల స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన విద్యార్థులు ప్రాంత స్థాయికి, ప్రాంత స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు క్షేత్ర స్థాయికి,క్షేత్ర స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు జాతీయ స్థాయికి ఎంపికై వెళ్లనున్నారు.ఈ కార్యక్రమాన్ని *విద్యా భారతి* సంస్థ అధినేతలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఈ విజ్ఞాన మేళా ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

Vizagvision Anakapalli : మర్తి లో ఫైజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ ప్రజాస్పందనలేమర్తి , అనకాపల్లి జిల్లా, ఆగస్టు 13, 2026: ప్రముఖ బహుళజాతి ఔషధ మరియు బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శంకర్ ఫౌండేషన్ సహకారంతో, తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, లేమర్తి గ్రామంలో సమగ్ర ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారిలో శ్రీ రవి పోలిశెట్టి, క్వాలిటీ హెడ్; శ్రీ రాజేష్ రావూరి, ఫైనాన్స్ హెడ్; శ్రీ సత్జీత్ సింగ్, ఐటీ హెడ్; శ్రీ ఎం.వి. రామరాజు, పబ్లిక్ అఫైర్స్ & CSR హెడ్; మరియు డా. పి. ఈశ్వర్ రావు, మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. వీరితో పాటు శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రవి చందర్ కట్టా మాట్లాడుతూ, శిబిరానికి హాజరైన లబ్ధిదారులు ఈ కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, నివారించగల అంధత్వాన్ని అరికట్టేందుకు అందిస్తున్న సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు. సమాజానికి శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను ఆయన అభినందించారు. అర్హులైన లబ్ధిదారులకు అక్కడికక్కడే కళ్లద్దాలను అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వెనుకబడిన వర్గాల ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించడంలో శంకర్ ఫౌండేషన్ చూపిస్తున్న నిబద్ధతను ఆయన అభినందించారు.ఫైజర్ సంస్థకు చెందిన అధికారులు శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా మరియు విజయవంతంగా నిర్వహించినందుకు శంకర్ ఫౌండేషన్ను అభినందించారు. అనంతరం శిబిరానికి హాజరైన రోగులకు కళ్లద్దాలు మరియు మందులను పంపిణీ చేశారు. లేమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మరియు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ జె. నాగేశ్వరరావు శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందించారు.ఈ కంటి పరీక్షా శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సమాజంలోని ప్రజల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నివారించగల అంధత్వాన్ని తగ్గించడం పట్ల ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు శంకర్ ఫౌండేషన్ కలసి చూపిస్తున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.కంటి శిబిరం ముఖ్యాంశాలు : శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు మాట్లాడుతూ, సమీప గ్రామాల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.• 535 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు • 360 మందికి కళ్లద్దాలు సూచించారు • 350 మందికి అక్కడికక్కడే కళ్లద్దాలు అందజేశారు • 42 మంది రోగులను కంటి శుక్లం (క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు మరియు ఇతర చికిత్సా విధానాలకు గుర్తించారు , వీరిని నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి శస్త్రచికిత్సల కోసం తరలించారు.• 170 మంది రోగులకు మందులు అందజేశారువైద్య బృందం & సహాయక సిబ్బంది: రోగులకు కంటి పరీక్షలను శంకర్ ఫౌండేషన్కు చెందిన డా. యధార్థ్ మరియు డా. అన్నా జోసెఫ్ నిర్వహించారు. ఈ కంటి శిబిరాన్ని శ్రీ ఎన్. అప్పల రాజు (సీనియర్ మేనేజర్ – అవుట్రీచ్) నాయకత్వంలో, శ్రీ అరుణ్ కుమార్, మేనేజర్; శ్రీ ఈశ్వర్ రావు (సీనియర్ మేనేజర్); శ్రీ రాము (సీనియర్ మేనేజర్ – ఆప్టికల్ మేనేజ్మెంట్); శ్రీ రతన్ రాజు (మేనేజర్ – ఆప్టోమెట్రీ విభాగం); శ్రీమతి శ్రుతి (CR); మరియు శ్రీమతి హరిత, ఫార్మసిస్ట్ కూడిన అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు మరియు పారామెడికల్ సిబ్బంది బృందం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించింది.ఫోటో క్యాప్షన్: 1. ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రసంగిస్తున్న దృశ్యం.2.ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా రోగులకు కళ్లద్దాలను పంపిణీ చేస్తున్న దృశ్యం. 3.శ్రీ రవి చందర్ కట్టా మరియు ఫైజర్ అధికారులు ఈ రోజు కంటి శిబిరాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం. (K.BANGAR RAJU )DEPUTY GENERAL MANAGER (PR , LIAISON & Corporate Relations)Sankar Foundation Eye Hospital & InstitutePh.no.98481 89378