Home UncategorizedVizagvision Visakhapatnam:శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో జరగబోయే మార్గశిరమాసోత్సవములు శుభారంభ సూచికగా జరుపబడు, “రాటమూహూర్తం” నేడు నిర్వహించబడినది. ప్రతి సంవత్సరము కార్తీక శుద్ద ఏకాదశిరోజున రాట వేసి మార్గశిరమాసోత్సవములకు శ్రీకారం చుట్టుట ఆనవాయితీగా వస్తున్నది. ఆ సాంప్రదాయం ప్రకారం నేటి ఉ..9.35 ని..లకు నాదస్వర సుస్వారాలతో, వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించుట జరిగినది. తదుపరి రాట వేసిన అనంతరం రాట ముహూర్త కార్యక్రమములో పాల్గొన్న ముత్తైదువులకు నేటి నుండి శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిరమాసోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు చేయుటకు తాంబూలం పంపిణీ చేయుట జరిగినది. ఆరంభించుట జరిగినది.

Vizagvision Visakhapatnam:శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో జరగబోయే మార్గశిరమాసోత్సవములు శుభారంభ సూచికగా జరుపబడు, “రాటమూహూర్తం” నేడు నిర్వహించబడినది. ప్రతి సంవత్సరము కార్తీక శుద్ద ఏకాదశిరోజున రాట వేసి మార్గశిరమాసోత్సవములకు శ్రీకారం చుట్టుట ఆనవాయితీగా వస్తున్నది. ఆ సాంప్రదాయం ప్రకారం నేటి ఉ..9.35 ని..లకు నాదస్వర సుస్వారాలతో, వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించుట జరిగినది. తదుపరి రాట వేసిన అనంతరం రాట ముహూర్త కార్యక్రమములో పాల్గొన్న ముత్తైదువులకు నేటి నుండి శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిరమాసోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు చేయుటకు తాంబూలం పంపిణీ చేయుట జరిగినది. ఆరంభించుట జరిగినది.

by Deva Trinadh Rao

ఈ రాట ముహూర్త కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వాహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కె. నాగరాజు మరియు ధర్మకర్తలు శ్రీమతి టి. వేణి కుమారి, శ్రీమతి ఆర్. శైలజ, శ్రీమతి కె. స్వరూప రాణి, శ్రీ ఎస్. రామారావు, శ్రీ డి. శ్రీకాంత్, శ్రీమతి ఎం. నాగ సుధ, శ్రీమతి సిహెచ్. మంజుల, శ్రీమతి కె. అనురాధ, శ్రీమతి టి. నాగమణి, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీ బి.రాంబాబు, సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీ ఎన్.వి.వి.ఎస్.ఎస్.ఎ.ఎన్. రాజు, పర్యవేక్షకులు శ్రీ ఎం. వి. రమణ, వేదపండితులు, అర్చకులు స్థానిక నాయకులు మరియు బురుజుపేట వాస్తవ్యులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment