Home UncategorizedVizagVision Visakhapatnam:సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా రంగంలో PM e- Bus Sewa తో నూతన శకం మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు. రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్‌ను ప్రారంభించి, డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున రాష్ట్రం లో మొదటి E – బస్ పవర్ రూమ్ ప్రారంభం నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టడంపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశలవారీగా ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం సంస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రిగారిని డిపో కమిటీలు, కార్మికుల సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు, ఇంజినీర్లు, డిపో మేనేజర్లు, ఉద్యోగులు, వివిధ ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

VizagVision Visakhapatnam:సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా రంగంలో PM e- Bus Sewa తో నూతన శకం మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు. రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్‌ను ప్రారంభించి, డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున రాష్ట్రం లో మొదటి E – బస్ పవర్ రూమ్ ప్రారంభం నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టడంపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశలవారీగా ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం సంస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రిగారిని డిపో కమిటీలు, కార్మికుల సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు, ఇంజినీర్లు, డిపో మేనేజర్లు, ఉద్యోగులు, వివిధ ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

by Deva Trinadh Rao

You may also like

Leave a Comment