Vizagvision Visakhapatnam:

వేసవిలో కాలుష్య నియంత్రణ పై పోర్ట్ అధికారుల సమావేశం

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA)లో గౌరవ ఎమ్మెల్యే శ్వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మరియు గౌరవ డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కొరాటి, IAS ఆధ్వర్యంలో వేసవి కాలంలో పర్యావరణ నియంత్రణ పై సమగ్ర భాగస్వామ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేసవి కాలంలో పోర్టు పరిధిలో కాలుష్య మరియు దుమ్ము నియంత్రణ చర్యలను సమర్ధవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించారు.మెకానికల్ & ఎలక్ట్రికల్ విభాగం దుమ్ము కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపడుతున్న చర్యలపై సమగ్ర వివరాలను సమావేశంలో అందించారు. 4 ఇండస్ట్రియల్ స్వీపింగ్ మెషీన్లు (సెల్ఫ్ ప్రొపెల్డ్ మరియు ట్రక్ మౌంటెడ్ యూనిట్లు) ప్రధాన కార్గో రహదారులు, డాక్ ప్రాంతాలు మరియు ముఖ్య కూడళ్లలో పనిచేస్తున్నాయి. అదనంగా, సుమారు 20 కి.మీ డాక్ ప్రాంతంలో 50 మీటర్ల పరిధి కలిగిన 6 ఫాగ్ మెషీన్లు/క్యానన్లు గాలిలో తేలే దుమ్మును తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు.బల్క్ కార్గో నుంచి ఉత్పన్నమయ్యే దుమ్మును నియంత్రించేందుకు, S-6, NH యార్డ్, WQ-7 & WQ-8 మరియు ఈస్ట్ యార్డ్ వంటి ప్రధాన నిల్వ ప్రదేశాల్లో 186 మెకానికల్ డస్ట్ సప్రెషన్ సిస్టమ్ (MDSS) స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి సుమారు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తున్నాయి. అదనంగా, 10 ట్యాంకర్ ట్రక్కుల ద్వారా రోజుకు సుమారు 180 ట్రిప్పులతో నిరంతర నీటి చల్లడం జరుగుతోంది.నీటి కాలుష్య నియంత్రణలో భాగంగా, యెరిగెడ్డ మరియు గంగులగెడ్డ ప్రవాహ మార్గాలలో 3 ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్లు (FTB) ఏర్పాటు చేశారు, ఇవి హార్బర్‌లోకి ప్రవేశించే తేలియాడే వ్యర్థాలను సేకరిస్తున్నాయి. అలాగే, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) సామర్థ్యాన్ని 10 MLD నుండి 15 MLDకు పెంచి, వ్యర్థజలాలను శుద్ధి చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకువస్తున్నారు.పర్యావరణానికి అనుకూలమైన చర్యలలో భాగంగా, 10 మెగావాట్ + 770 కిలోవాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు అమలు చేయబడి, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను 8.27 మెట్రిక్ టన్నుల CO₂ వరకు తగ్గించడంలో సహాయపడ్డాయి. కోల్ మరియు ఐరన్ ఓర్ నిర్వహణలో యాంత్రీకరణను PPP విధానంలో చేపట్టడం ద్వారా దుమ్ము ఉద్గారాలను తగ్గిస్తున్నారు.అదనపు మౌలిక సదుపాయ చర్యలలో కోల్ నిల్వలపై మరియు ట్రక్కులపై తార్పాలిన్ కవర్లు, నీటి స్ప్రే సదుపాయంతో కూడిన మూసివేసిన కన్వేయర్ వ్యవస్థలు, PLC ఆధారిత ఆటోమేటెడ్ MDSS వ్యవస్థలు ఉన్నాయి. నగర సరిహద్దుల్లో 4 కి.మీ పొడవైన ఎత్తైన డస్ట్ బ్యారియర్ గోడలు నిర్మించబడినాయి. దుమ్ము వ్యాప్తి నివారణ కోసం అధిక సామర్థ్యం కలిగిన కవర్డ్ స్టోరేజ్ షెడ్లు కూడా ఏర్పాటు చేసియున్నారు.పచ్చదనం పెంపు కార్యక్రమంలో భాగంగా 6.65 లక్షల మొక్కలను నాటి గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేశారు. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది.పర్యావరణ పర్యవేక్షణ కోసం నిరంతర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరిన్ని కేంద్రాలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ETPs), చిన్న STPs, CNG బస్సులు, జూట్ బ్యాగ్‌ల పంపిణీ వంటి పర్యావరణ అనుకూల చర్యలు అమలవుతున్నాయి.పోర్ట్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, గౌరవ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ చైర్‌పర్సన్ లు వేసవి కాలంలో శుభ్రమైన, పచ్చదనం కలిగిన, కాలుష్య రహిత పోర్టు వాతావరణం కోసం భాగస్వాములు అందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

Related posts

Vizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam:

Vizag Vision Visakhapatnam శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ ఈరోజు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ని సందర్శించి సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని ఒ.పి. డి. మరియు స్పెషాలిటీ విభాగాలను సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలను సౌకర్యాలను ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. గౌరవ మంత్రి ఆసుపత్రి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఆత్మకూరు శంకర్ రావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారుఈ సందర్భంగా ఆయన శంకర్ ఫౌండేషన్ లో నూతనంగా సమకూర్చుకున్న శ్రీమతి ఆత్మకూరి యశోద విజన్ నాలెడ్జి సెంటర్ ని శ్రీ భరత్ చేతులమీదుగా ప్రారంభించారు. తరువాత నూతనంగా ప్రారంభించిన సెంటర్ లో ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్,పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆసుపత్రి గత 29 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను మంత్రిగారికి వివరించారు. తరువాత జరిగిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆసుపత్రి యొక్క సేవలను ర్రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు మేనేజింగ్ ట్రస్టీ ని కోరారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేకంగా ఫాండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు సంస్థ సేవలు అందిచడం గొప్ప విషయమని మరియు రాష్ట్రంలో ప్రఖ్యాత కంటి ఆసుపత్రిల తరహాలో శంకర్ ఫౌండేషన్ సేవలు కూడా ఇంత గణనీయంగా ఉండడం చాలా గొప్ప విషయం అని, ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వున్న NDA ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని తెలియచేసారు. సమావేశంలో పాల్గొన్న శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి ఉషా కృష్ణ మరియు మేనేజింగ్ ట్రస్టీ కృష్ణ ఆహ్వానము మేరకు శంకర్ ఫౌండేషన్ కు రావడం జరిగిందని ఇక్కడకు వచ్చిన తర్వాత ఆసుపత్రిని సందర్శించి సేవలను తెలుసుకోవటం చాలా సంతృప్తినిచ్చిందని సంస్థ అందిస్తున్న సేవలకు తన సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేసారు.కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ డాక్టర్లు ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, అజయ్ శర్మ, రవీంద్ర, శిరీష, కృష్ణ సుపర్ణ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ బంగార్రాజు, వేణుగోపాల్, కనకరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.