Home NewsSaptha Shakti Sangam Matru Sammelana Sri T.V.S Rao Sri Krishna Vidya Mandir in Visakhapatnam

Saptha Shakti Sangam Matru Sammelana Sri T.V.S Rao Sri Krishna Vidya Mandir in Visakhapatnam

by kishore226226@gmail.com

Saptha Shakti Sangam Matru Sammelana
Sri T.V.S Rao Sri Krishna Vidya Mandir in Visakhapatnam Vizagvisionస్థానిక ద్వారకా నగర్ లో గల శ్రీ టీవీఎస్ రావు శ్రీకృష్ణ విద్యా మందిర్ పాఠశాలలో సప్తశక్తి సంఘంలో భాగంగా మాతృమూర్తుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి అధ్యక్షులుగా డాక్టర్ బి ధరణి ప్రియ గారు విచ్చేశారు ముఖ్య అతిథులుగా డాక్టర్ పీకే జయలక్ష్మి గారు శ్రీమతి లింగము ఉజ్వలగారు శ్రీమతి అంజలి ప్రసాద్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతివి నర్మద గారు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వల నతోకార్యక్రమం ప్రారంభమైంది. పాఠశాల వందనంతో సభ మొదలుపెట్టారు సప్తశక్తి సంఘం లో మహిళా ప్రబోధన గురించి వక్తలు ఉపన్యాసించారు జయలక్ష్మి గారు కుటుంబ ప్రబోధం గురించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి కుటుం బ అభివృద్ధిలో స్త్రీ యొక్క పాత్ర గురించి ప్రసంగించారు శ్రీమతి ఉజ్వల గారు భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర గురించి ప్రసంగించారు చివరిగా డాక్టర్ ధరణి ప్రియ గారు అధ్యక్ష భాషణలో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరా లు పూర్తయిన సందర్భంగా మహిళల గొప్పతనం గురించి వారి సామర్థ్యాన్ని గురించి ప్రసంగించారు సభలో పలువురు మాతృమూర్తులను సన్మానించారు ఈ సప్తశక్తి సంఘం సభ స్త్రీమూర్తులతో కలకలలాడింది చక్కని ఉపన్యాసాలతో అలరించారు స్త్రీమూర్తుల కరతాలధ్వనులతో సభ దిగ్విజయంగా ముగిసింది

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.