News The Deck Building Vizag # #vizagvision #news #ytshots by kishore226226@gmail.com August 13, 2026 August 13, 2026 46 The Deck Building Vizag # #vizagvision #news #ytshots 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post #Live Nara Chandrababu Naidu inaugurates Steel Bridge Seed Access Road at Undavalli Courtesy I&PR next post Vizagvision Anakapalli : మర్తి లో ఫైజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ ప్రజాస్పందనలేమర్తి , అనకాపల్లి జిల్లా, ఆగస్టు 13, 2026: ప్రముఖ బహుళజాతి ఔషధ మరియు బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శంకర్ ఫౌండేషన్ సహకారంతో, తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, లేమర్తి గ్రామంలో సమగ్ర ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారిలో శ్రీ రవి పోలిశెట్టి, క్వాలిటీ హెడ్; శ్రీ రాజేష్ రావూరి, ఫైనాన్స్ హెడ్; శ్రీ సత్జీత్ సింగ్, ఐటీ హెడ్; శ్రీ ఎం.వి. రామరాజు, పబ్లిక్ అఫైర్స్ & CSR హెడ్; మరియు డా. పి. ఈశ్వర్ రావు, మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. వీరితో పాటు శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రవి చందర్ కట్టా మాట్లాడుతూ, శిబిరానికి హాజరైన లబ్ధిదారులు ఈ కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, నివారించగల అంధత్వాన్ని అరికట్టేందుకు అందిస్తున్న సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు. సమాజానికి శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను ఆయన అభినందించారు. అర్హులైన లబ్ధిదారులకు అక్కడికక్కడే కళ్లద్దాలను అందిస్తున్న శంకర్ ఫౌండేషన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వెనుకబడిన వర్గాల ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించడంలో శంకర్ ఫౌండేషన్ చూపిస్తున్న నిబద్ధతను ఆయన అభినందించారు.ఫైజర్ సంస్థకు చెందిన అధికారులు శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా మరియు విజయవంతంగా నిర్వహించినందుకు శంకర్ ఫౌండేషన్‌ను అభినందించారు. అనంతరం శిబిరానికి హాజరైన రోగులకు కళ్లద్దాలు మరియు మందులను పంపిణీ చేశారు. లేమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మరియు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ జె. నాగేశ్వరరావు శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందించారు.ఈ కంటి పరీక్షా శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సమాజంలోని ప్రజల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నివారించగల అంధత్వాన్ని తగ్గించడం పట్ల ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు శంకర్ ఫౌండేషన్ కలసి చూపిస్తున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.కంటి శిబిరం ముఖ్యాంశాలు : శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు మాట్లాడుతూ, సమీప గ్రామాల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.• 535 మంది ఔట్‌పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు • 360 మందికి కళ్లద్దాలు సూచించారు • 350 మందికి అక్కడికక్కడే కళ్లద్దాలు అందజేశారు • 42 మంది రోగులను కంటి శుక్లం (క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు మరియు ఇతర చికిత్సా విధానాలకు గుర్తించారు , వీరిని నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి శస్త్రచికిత్సల కోసం తరలించారు.• 170 మంది రోగులకు మందులు అందజేశారువైద్య బృందం & సహాయక సిబ్బంది: రోగులకు కంటి పరీక్షలను శంకర్ ఫౌండేషన్‌కు చెందిన డా. యధార్థ్ మరియు డా. అన్నా జోసెఫ్ నిర్వహించారు. ఈ కంటి శిబిరాన్ని శ్రీ ఎన్. అప్పల రాజు (సీనియర్ మేనేజర్ – అవుట్‌రీచ్) నాయకత్వంలో, శ్రీ అరుణ్ కుమార్, మేనేజర్; శ్రీ ఈశ్వర్ రావు (సీనియర్ మేనేజర్); శ్రీ రాము (సీనియర్ మేనేజర్ – ఆప్టికల్ మేనేజ్మెంట్); శ్రీ రతన్ రాజు (మేనేజర్ – ఆప్టోమెట్రీ విభాగం); శ్రీమతి శ్రుతి (CR); మరియు శ్రీమతి హరిత, ఫార్మసిస్ట్ కూడిన అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు మరియు పారామెడికల్ సిబ్బంది బృందం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించింది.ఫోటో క్యాప్షన్: 1. ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రసంగిస్తున్న దృశ్యం.2.ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా రోగులకు కళ్లద్దాలను పంపిణీ చేస్తున్న దృశ్యం. 3.శ్రీ రవి చందర్ కట్టా మరియు ఫైజర్ అధికారులు ఈ రోజు కంటి శిబిరాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం. (K.BANGAR RAJU )DEPUTY GENERAL MANAGER (PR , LIAISON & Corporate Relations)Sankar Foundation Eye Hospital & InstitutePh.no.98481 89378 You may also like పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం నేడు,రేపు భారీ వర్షాల అప్రమత్తంగా ఉండాలి... September 23, 2026 40వారిటీస్ తో అన్న విత్రణ కొబరితోటలో # #vizagvision #news... September 22, 2026 ఖరీదైన వైద్యం… గణపయ్యేవారి ధైర్యం # #vizagvision #news #ytshots September 22, 2026 Celebration 100 Bone Marrow Transplants by Apollo Cancer... September 22, 2026 విశాఖలో భారీ వర్షం రోడ్స్ జలమయం #vizagvision #news #ytshots September 21, 2026 Andhra Pradesh Renewable Energy Expo–2026 on 25th &... September 21, 2026 విశాఖలో భారీ వర్షం రోడ్స్ జలమయం # #vizagvision #ytshots... September 21, 2026 బంగాళాఖాతంలో మరో వాయుగుండం… ఏపీకి భారీ వర్షాల సూచన #... September 20, 2026 wood pulp traffic from Road to Rail South... September 20, 2026 ఏపీకి భారీ వర్షాలు బంగాళాఖాతంలో మరో వాయుగుండం in Visakhapatnam... September 20, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.