Home UncategorizedVizag Vision Visakhapatnam:

Vizag Vision Visakhapatnam:

by Deva Trinadh Rao

విశాఖపట్నం పోర్ట్ లో పర్యటించిన పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి

కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి 25-05-2026న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ను సందర్శించారు.

పోర్ట్ చైర్‌పర్సన్ శ్రీ జె.ఎస్. బింద్రా, ఐఆర్‌టీఎస్, గౌరవ మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గౌరవ మంత్రి లాంచ్ ద్వారా సింగిల్ పాయింట్ మూరింగ్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా సింగల్ పాయింట్ మూరింగ్ పనితీరు పోర్ట్ యొక్క సమగ్ర కార్యకలాపాలను చైర్‌పర్సన్ వివరించారు. పోర్టులో జరుగుతున్న ఎగుమతి–దిగుమతి కార్యకలాపాలు, ఆధునీకరణ మరియు యాంత్రీకరణ చర్యలు, పోర్టులో అమలు చేస్తున్న పలు హరిత కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు.

పోర్టులో కొనసాగుతున్న అభివృద్ధి మరియు ఆధునీకరణ కార్యక్రమాలను గౌరవ మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో వీపీఏ విభాగాధిపతులు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment