Vizagvision Vijayawada:ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా డా.నేమాల నియామకంఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ (న్యూడిల్లీ)అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ డా.నేమాల హేమసుందరరావు నియమితులయ్యారు.ఈ మేరకు విజయవాడ గాంధీనగర్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామకపత్రాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.కాకుమాను వెంకట వేణు,ప్రధాన కార్యదర్శి గాదoశెట్టి శేఖర్ బాబులచే హేమసుందర్ అందుకున్నారు.ఈ సందర్భంగా డా.నేమాల మాట్లాడుతూ తనకుఈ బాధ్యతలను అప్పగించిన యూనియన్ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతుకృషి చేస్తానన్నారు.

Related posts

Vizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam:

Vizag Vision Visakhapatnam శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ ఈరోజు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ని సందర్శించి సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని ఒ.పి. డి. మరియు స్పెషాలిటీ విభాగాలను సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలను సౌకర్యాలను ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. గౌరవ మంత్రి ఆసుపత్రి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఆత్మకూరు శంకర్ రావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారుఈ సందర్భంగా ఆయన శంకర్ ఫౌండేషన్ లో నూతనంగా సమకూర్చుకున్న శ్రీమతి ఆత్మకూరి యశోద విజన్ నాలెడ్జి సెంటర్ ని శ్రీ భరత్ చేతులమీదుగా ప్రారంభించారు. తరువాత నూతనంగా ప్రారంభించిన సెంటర్ లో ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్,పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆసుపత్రి గత 29 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను మంత్రిగారికి వివరించారు. తరువాత జరిగిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆసుపత్రి యొక్క సేవలను ర్రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు మేనేజింగ్ ట్రస్టీ ని కోరారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేకంగా ఫాండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు సంస్థ సేవలు అందిచడం గొప్ప విషయమని మరియు రాష్ట్రంలో ప్రఖ్యాత కంటి ఆసుపత్రిల తరహాలో శంకర్ ఫౌండేషన్ సేవలు కూడా ఇంత గణనీయంగా ఉండడం చాలా గొప్ప విషయం అని, ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వున్న NDA ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని తెలియచేసారు. సమావేశంలో పాల్గొన్న శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి ఉషా కృష్ణ మరియు మేనేజింగ్ ట్రస్టీ కృష్ణ ఆహ్వానము మేరకు శంకర్ ఫౌండేషన్ కు రావడం జరిగిందని ఇక్కడకు వచ్చిన తర్వాత ఆసుపత్రిని సందర్శించి సేవలను తెలుసుకోవటం చాలా సంతృప్తినిచ్చిందని సంస్థ అందిస్తున్న సేవలకు తన సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేసారు.కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ డాక్టర్లు ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, అజయ్ శర్మ, రవీంద్ర, శిరీష, కృష్ణ సుపర్ణ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ బంగార్రాజు, వేణుగోపాల్, కనకరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.