Vizagvision Visakhapatnam :

111ఏళ్లు..రూ.8473కోట్ల టర్నోవర్!
60శాఖలుగా విస్తరించిన విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు .. వార్షికోత్సవ సమావేశంలో చైర్మన్ జేవీ సత్యనారాయణమÖర్తి ..

‘ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ’ తన 111ఏళ్ల ప్రస్థానంలో రూ.8473కోట్ల టర్నోవర్ సాధించగలిగిందని ఆ బ్యాంకు చైర్మన్ జేవీ సత్యనారాయణ మÖర్తి (నాని) ఆనందం వ్యక్తం చేశారు. ఆ బ్యాంకు వార్షికోత్సవం సందర్భంగా విశాఖలోని ద్వారకానగర్‌లోని ప్రధాన శాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈవో వీవీబీ వరలక్ష్మి, బ్యాంకు పాలక వర్గ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు 60శాఖలుగా విస్తరించి, ఈ ఒక్క ఏడాదిలో సుమారు రూ.681కోట్ల పెరుగుదల కనిపించిందని స్పష్టం చేశారు. పదేళ్లగా దేశంలోనే అతి పెద్ద కో`ఆపరేటివ్ బ్యాంకుగా తమ బ్యాంకు కొనసాగతూ సహకార సూత్రాల్ని త్రికరణ శుద్ధితో ప్రజాస్వామ్య బద్ధంగా అమలు చేస్తోందన్నారు. 1983లో బ్యాంకు చైర్మన్‌గా మానం ఆంజనేయులు బాధ్యతలు చేపట్టే నాటికి కేవలం రూ.1కోటి ఆర్థిక కార్యకలాపాలే ఉండేవని, అయితే నాలుగు దశాబ్దాలుగా చైర్మన్, చైర్మన్ ఎమిరిటీస్‌గా పని చేసిన ఆయన పాలకవర్గం సమష్టి నిర్ణయాలతో బ్యాంకును ప్రగతి బాటలో నడిపించారని సత్యనారాయణ మÖర్తి గుర్తు చేశారు. ఆయనతో పాటు డైరెక్టర్, ఈడీగా పని చేసిన చలసాని రాఘవేంద్రరరావు బ్యాంకు చైర్మన్‌గా బ్యాంకును ఉన్నతస్థానంలో నిలపడంలో మరింత కృషి చేశారన్నారు. గతేడాది చైర్మన్‌గా సత్యనారాయణ ఎన్నికయ్యాక ఇదే తొలి సమావేశం కావడంతో విశేషం సంతరించకుంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సభ్యులుగా చేరి, ప్రజలు సమకూర్చిన రూ.416.29 కోట్ల షేరుధనంతో దేశంలోనే తమ బ్యాంకు అగ్ర స్థానంలో నిలబడిందని సత్యనారాయణ మÖర్తి తెలిపారు. డిపాజిట్లు, రుణాల మంజూరు, నికర లాభం తదితర 15అంశాల్లో తమ బ్యాంకు తొలి 15బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగడం గర్వకారణమన్నారు. ఈ యేడాది మార్చి నాటికి బ్యాంకు పని తీరును ఆయన వివరించారు. బ్యాంకులు 1,17,884 మంది సభ్యులుగా ఉన్నారని, రూ. 416.25 కోట్లు మÖలధనం ఉందని, రూ.4,594,97 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని, రూ.3,877.42 కోట్లు రుణాలున్నాయని, రూ.8,472,39 కోట్ల నికర లాభం, పన్నుల అనంతరం రూ. 66,15 కోట్లు ఉందన్నారు. క్రమం తప్పకుండా సభ్యులకు 10 నుంచి 42శాతం వరకు డివిడెండ్ వెళ్తోందన్నారు. తమకు 16సొంత భవనాలున్నాయని, మరెక్కడా లేని విధంగా 25శాతం శాఖలు సొంత భవనాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సత్యనారాయణ మÖర్తి స్పష్టం చేశారు. మరో 9కొత్త శాఖలు రానున్నాయన్నారు. తమ బ్యాంకులో విలీనమయ్యేందుకు పలు శాఖలు ముందుకొచ్చాయని, తమ బ్యాంకు సభ్యలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఖాతాదారులకు కూడా అనేక రాయితీలిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Related posts

Vizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam:

Vizag Vision Visakhapatnam శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ ఈరోజు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ని సందర్శించి సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని ఒ.పి. డి. మరియు స్పెషాలిటీ విభాగాలను సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలను సౌకర్యాలను ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. గౌరవ మంత్రి ఆసుపత్రి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఆత్మకూరు శంకర్ రావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారుఈ సందర్భంగా ఆయన శంకర్ ఫౌండేషన్ లో నూతనంగా సమకూర్చుకున్న శ్రీమతి ఆత్మకూరి యశోద విజన్ నాలెడ్జి సెంటర్ ని శ్రీ భరత్ చేతులమీదుగా ప్రారంభించారు. తరువాత నూతనంగా ప్రారంభించిన సెంటర్ లో ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్,పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆసుపత్రి గత 29 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను మంత్రిగారికి వివరించారు. తరువాత జరిగిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆసుపత్రి యొక్క సేవలను ర్రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు మేనేజింగ్ ట్రస్టీ ని కోరారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేకంగా ఫాండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు సంస్థ సేవలు అందిచడం గొప్ప విషయమని మరియు రాష్ట్రంలో ప్రఖ్యాత కంటి ఆసుపత్రిల తరహాలో శంకర్ ఫౌండేషన్ సేవలు కూడా ఇంత గణనీయంగా ఉండడం చాలా గొప్ప విషయం అని, ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వున్న NDA ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని తెలియచేసారు. సమావేశంలో పాల్గొన్న శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి ఉషా కృష్ణ మరియు మేనేజింగ్ ట్రస్టీ కృష్ణ ఆహ్వానము మేరకు శంకర్ ఫౌండేషన్ కు రావడం జరిగిందని ఇక్కడకు వచ్చిన తర్వాత ఆసుపత్రిని సందర్శించి సేవలను తెలుసుకోవటం చాలా సంతృప్తినిచ్చిందని సంస్థ అందిస్తున్న సేవలకు తన సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేసారు.కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ డాక్టర్లు ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, అజయ్ శర్మ, రవీంద్ర, శిరీష, కృష్ణ సుపర్ణ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ బంగార్రాజు, వేణుగోపాల్, కనకరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.