111ఏళ్లు..రూ.8473కోట్ల టర్నోవర్!
60శాఖలుగా విస్తరించిన విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు .. వార్షికోత్సవ సమావేశంలో చైర్మన్ జేవీ సత్యనారాయణమÖర్తి ..
‘ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ’ తన 111ఏళ్ల ప్రస్థానంలో రూ.8473కోట్ల టర్నోవర్ సాధించగలిగిందని ఆ బ్యాంకు చైర్మన్ జేవీ సత్యనారాయణ మÖర్తి (నాని) ఆనందం వ్యక్తం చేశారు. ఆ బ్యాంకు వార్షికోత్సవం సందర్భంగా విశాఖలోని ద్వారకానగర్‌లోని ప్రధాన శాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈవో వీవీబీ వరలక్ష్మి, బ్యాంకు పాలక వర్గ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు 60శాఖలుగా విస్తరించి, ఈ ఒక్క ఏడాదిలో సుమారు రూ.681కోట్ల పెరుగుదల కనిపించిందని స్పష్టం చేశారు. పదేళ్లగా దేశంలోనే అతి పెద్ద కో`ఆపరేటివ్ బ్యాంకుగా తమ బ్యాంకు కొనసాగతూ సహకార సూత్రాల్ని త్రికరణ శుద్ధితో ప్రజాస్వామ్య బద్ధంగా అమలు చేస్తోందన్నారు. 1983లో బ్యాంకు చైర్మన్‌గా మానం ఆంజనేయులు బాధ్యతలు చేపట్టే నాటికి కేవలం రూ.1కోటి ఆర్థిక కార్యకలాపాలే ఉండేవని, అయితే నాలుగు దశాబ్దాలుగా చైర్మన్, చైర్మన్ ఎమిరిటీస్‌గా పని చేసిన ఆయన పాలకవర్గం సమష్టి నిర్ణయాలతో బ్యాంకును ప్రగతి బాటలో నడిపించారని సత్యనారాయణ మÖర్తి గుర్తు చేశారు. ఆయనతో పాటు డైరెక్టర్, ఈడీగా పని చేసిన చలసాని రాఘవేంద్రరరావు బ్యాంకు చైర్మన్‌గా బ్యాంకును ఉన్నతస్థానంలో నిలపడంలో మరింత కృషి చేశారన్నారు. గతేడాది చైర్మన్‌గా సత్యనారాయణ ఎన్నికయ్యాక ఇదే తొలి సమావేశం కావడంతో విశేషం సంతరించకుంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సభ్యులుగా చేరి, ప్రజలు సమకూర్చిన రూ.416.29 కోట్ల షేరుధనంతో దేశంలోనే తమ బ్యాంకు అగ్ర స్థానంలో నిలబడిందని సత్యనారాయణ మÖర్తి తెలిపారు. డిపాజిట్లు, రుణాల మంజూరు, నికర లాభం తదితర 15అంశాల్లో తమ బ్యాంకు తొలి 15బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగడం గర్వకారణమన్నారు. ఈ యేడాది మార్చి నాటికి బ్యాంకు పని తీరును ఆయన వివరించారు. బ్యాంకులు 1,17,884 మంది సభ్యులుగా ఉన్నారని, రూ. 416.25 కోట్లు మÖలధనం ఉందని, రూ.4,594,97 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని, రూ.3,877.42 కోట్లు రుణాలున్నాయని, రూ.8,472,39 కోట్ల నికర లాభం, పన్నుల అనంతరం రూ. 66,15 కోట్లు ఉందన్నారు. క్రమం తప్పకుండా సభ్యులకు 10 నుంచి 42శాతం వరకు డివిడెండ్ వెళ్తోందన్నారు. తమకు 16సొంత భవనాలున్నాయని, మరెక్కడా లేని విధంగా 25శాతం శాఖలు సొంత భవనాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సత్యనారాయణ మÖర్తి స్పష్టం చేశారు. మరో 9కొత్త శాఖలు రానున్నాయన్నారు. తమ బ్యాంకులో విలీనమయ్యేందుకు పలు శాఖలు ముందుకొచ్చాయని, తమ బ్యాంకు సభ్యలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఖాతాదారులకు కూడా అనేక రాయితీలిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
