విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. కేప్ సైజ్ బల్క్ క్యారియర్ నౌక ఎం.వి. గ్రేషియస్ ను శుక్రవారం ఇన్నర్ హార్బర్లోని ఈక్యూ-1 బెర్త్ వద్ద విజయవంతంగా బెర్తింగ్ చేసి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది.

292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు, 12.2 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన ఈ నౌక 1,00,198 మెట్రిక్ టన్నుల కార్గోతో విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది.
ఈ నౌక బెర్తింగ్ తో విశాఖపట్నం పోర్ట్ కేప్ స్థాయి నౌకలను బెర్తింగ్ చేసే సదుపాయాన్ని మరింత మెరుగుపరచుకుంది. దీనివల్ల భారీ బల్క్ క్యారియర్ నౌకలను నిర్వహించే సామర్థ్యం పెరిగి, కార్గో నిర్వహణలో పోర్టు సామర్థ్యం మరింత బలోపేతం అయింది.
ఈ విజయవంతమైన బెర్తింగ్కు శ్రీ జస్మీత్ సింగ్ బింద్రా, ఐఆర్టీఎస్, ఛైర్పర్సన్, శ్రీమతి రోష్ని అపరంజి కోరాటి, ఐఏఎస్, డిప్యూటీ ఛైర్పర్సన్, అందించిన ప్రేరణ, మార్గదర్శకత్వంతో పాటు పోర్ట్ బృందం సమిష్టి కృషి కారణమైంది.
సముద్ర వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు కార్యాచరణ సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరచాలన్న పోర్ట్ నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనంగా నిలుస్తుంది.