Home UncategorizedVizag Vision Visakhapatnam :జాతీయ మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఘనంగా ముగిసాయి… విద్యా భారతి – న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల విశాలక్షి నగర్ ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి.ముగింపు కార్యక్రమానికి ఆచార్య గొలపల్లి నాగేశ్వరరావు గారు, మాజీ వైస్‌చాన్సలర్, విశాఖపట్నం మరియు భారతీయ విద్యా కేంద్రం (BVK) చైర్మన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యురాలు ధరణిప్రియ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మూడు రోజుల పాటు దేశంలోని వివిధ క్షేత్రాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో “దక్షిణ క్షేత్రం ఓవరాల్ ఛాంపియన్”గా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే క్షేత్రాల వారీగా వర్గ ఛాంపియన్‌షిప్‌లను దక్షిణ క్షేత్రం – 3, ఈస్ట్ యూపీ క్షేత్రం – 2, మధ్య క్షేత్రం – 2, దక్షిణ మధ్య క్షేత్రం – 2 సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.విజేతలైన విద్యార్థులు తదుపరి జాతీయ స్థాయి మాల్ఖంబ్ SGFI పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని క్షేత్ర విద్యార్థి సమయోజకులు కే.ఆర్.కే. సత్యనారాయణ తెలిపారు. విజేతలు తమ క్షేత్రాలకు గర్వకారణంగా నిలిచారని ఆయన అభినందించారు.ఈ ముగింపు కార్యక్రమంలో అఖిల భారతీయ ఖేల్ భారతి వైస్ చైర్మన్ రఘునాథ్ సాహూ, పోటీల సంయోజక సంజయ్ కుమార్ సూద్, సహా సంయోజక రామచంద్రన్‌తో పాటు BVK సెక్రటరీ VR సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ AVS ఆచార్యులు, బోద నారాయణ రావు, రాజశేఖర్, DAV రమణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ సంయుక్త, పలువురు ప్రముఖులు, నిర్వాహకులు, క్రీడా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో మాల్ఖంబ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక బృందాన్ని భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య గొలపల్లి నాగేశ్వరరావు గారు, వి.ఆర్. సచిన్ నాయన గారు అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు విశాఖలో మాల్ఖంబ్ క్రీడా ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Vizag Vision Visakhapatnam :జాతీయ మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఘనంగా ముగిసాయి… విద్యా భారతి – న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల విశాలక్షి నగర్ ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి.ముగింపు కార్యక్రమానికి ఆచార్య గొలపల్లి నాగేశ్వరరావు గారు, మాజీ వైస్‌చాన్సలర్, విశాఖపట్నం మరియు భారతీయ విద్యా కేంద్రం (BVK) చైర్మన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యురాలు ధరణిప్రియ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మూడు రోజుల పాటు దేశంలోని వివిధ క్షేత్రాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో “దక్షిణ క్షేత్రం ఓవరాల్ ఛాంపియన్”గా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే క్షేత్రాల వారీగా వర్గ ఛాంపియన్‌షిప్‌లను దక్షిణ క్షేత్రం – 3, ఈస్ట్ యూపీ క్షేత్రం – 2, మధ్య క్షేత్రం – 2, దక్షిణ మధ్య క్షేత్రం – 2 సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.విజేతలైన విద్యార్థులు తదుపరి జాతీయ స్థాయి మాల్ఖంబ్ SGFI పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని క్షేత్ర విద్యార్థి సమయోజకులు కే.ఆర్.కే. సత్యనారాయణ తెలిపారు. విజేతలు తమ క్షేత్రాలకు గర్వకారణంగా నిలిచారని ఆయన అభినందించారు.ఈ ముగింపు కార్యక్రమంలో అఖిల భారతీయ ఖేల్ భారతి వైస్ చైర్మన్ రఘునాథ్ సాహూ, పోటీల సంయోజక సంజయ్ కుమార్ సూద్, సహా సంయోజక రామచంద్రన్‌తో పాటు BVK సెక్రటరీ VR సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ AVS ఆచార్యులు, బోద నారాయణ రావు, రాజశేఖర్, DAV రమణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ సంయుక్త, పలువురు ప్రముఖులు, నిర్వాహకులు, క్రీడా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో మాల్ఖంబ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక బృందాన్ని భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య గొలపల్లి నాగేశ్వరరావు గారు, వి.ఆర్. సచిన్ నాయన గారు అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు విశాఖలో మాల్ఖంబ్ క్రీడా ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

by Deva Trinadh Rao

You may also like

Leave a Comment