HomeUncategorizedVizagvision Visakhapatnam: జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా పందిరి వెంకట శివప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికరెండవ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన 120 మంది వార్డు సభ్యుల్లో 119 మందితో ప్రమాణ స్వీకారం చేయించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్.
Vizagvision Visakhapatnam: జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా పందిరి వెంకట శివప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికరెండవ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన 120 మంది వార్డు సభ్యుల్లో 119 మందితో ప్రమాణ స్వీకారం చేయించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలి.
నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.
కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎన్నికల పరిశీలకురాలు, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ శోభిక. (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీకి చెందిన 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ (పి.వి.ఎస్. ప్రసాద్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల జరిగిన జీవీఎంసీ రెండవ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన 120 మంది వార్డు సభ్యుల్లో 119 మందితో విశాఖ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి, ప్రిసైడింగ్ అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీకి చెందిన 49వ వార్డు కార్పొరేటర్ పొట్నూరు నీలవేణి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి నిర్వహించారు. డిప్యూటీ మేయర్ పదవికి జనసేన పార్టీకి చెందిన 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ పేరును విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభాపక్ష నేత పి. విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించగా, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ బలపరిచారు. ఈ పదవికి మరెవరూ పోటీలో లేకపోవడంతో పందిరి వెంకట శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి అభినందించారు. జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ, ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి తమను ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి వార్డు సభ్యుడు బాధ్యతాయుతంగా, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వార్డుల్లోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, 1979లో నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన సమయంలో విశాఖపట్నం నగర జనాభా సుమారు రెండున్నర లక్షలు మాత్రమే ఉండేదని, ప్రస్తుతం నగర జనాభా సుమారు 30 లక్షలకు చేరుకుందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26లో దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా జీవీఎంసీ ప్రథమ స్థానం సాధించడం విశాఖ నగరానికి గర్వకారణమని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల్లో చాలామంది తొలిసారిగా బాధ్యతలు చేపడుతున్నారని, మేయర్ డాక్టర్ ముక్క శ్రావణి ప్రమాణ స్వీకారం అనంతరం వార్డు సభ్యులందరికీ నగర అభివృద్ధి, పాలనాపరమైన అంశాలు, జీవీఎంసీ విధివిధానాలపై అవగాహన కల్పించేందుకు జీవీఎంసీ తరఫున ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగర అభివృద్ధిలో ప్రతి వార్డు సభ్యుడు తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన వార్డు సభ్యులందరికీ, ఏకగ్రీవంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ పందిరి వెంకట శివప్రసాద్కు కమిషనర్ అభినందనలు తెలిపారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన జీవీఎంసీ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 2025–26 సంవత్సరంలో దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా జీవీఎంసీ ప్రథమ స్థానం సాధించిందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు నగర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఆర్థిక వనరులకు నష్టం కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ విలువైన సలహాలు, సూచనలు అందించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ పందిరి వెంకట శివప్రసాద్కు అభినందనలు తెలియజేస్తూ, నగర అభివృద్ధి, జీవీఎంసీ పురోగతికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన డిప్యూటీ మేయర్ పందిరి వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.