Home UncategorizedVizag Vision Visakhapatnam :

Vizag Vision Visakhapatnam :

by Deva Trinadh Rao

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్…

• విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం. క్షతగాత్రులకు రూ. 10 లక్షల పరిహారం, చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తం ఆర్.ఐ.ఎన్.ఎల్. భరిస్తుంది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం.
• పదవీ విరమణ ప్రయోజనాల కింద రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు. కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 45.75 లక్షల అందుతాయి.
• స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల మాదిరి మృతుల పిల్లల చదువులు కొనసాగించేందుకు సహకారం.
• స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై విచారణకు బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు. విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాం.
• స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకే తికపరమైన ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో కార్మిక సంఘాలతో సమావేశం.
• విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకూడదన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.