పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ జీవించాల
గాలి,నీరు, భూమి కాలుష్యం కాకుండా చూసుకోవాలసామాజిక వనాలు విస్తారంగా పెంచాలిప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలిబి వీరేంద్ర, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎపి పిసిబి
పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ జీవించాలి అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి వీరేంద్ర పిలుపునిచ్చారు. సబ్బవరం లో దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం లో ఎన్ సి సి 13వ బెటాలియన్ క్యాంపు లో లెఫ్ట్ నెంట్ కల్నల్ స్వర్ణిం ప్రభాత్ అధ్యక్షతన, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నేతృత్వంలో 600 మంది విద్యార్థులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం పీల్చే గాలినీ, మనం త్రాగే నీటిని, మనం నివసించె భూమినీ కాలుష్యం కాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలని కోరారు. సామాజిక వనాలు విస్తారంగా పెంచాల్సిన బాధ్యత మానవాళిదే అని వివరించారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ సమస్త జీవరాశినీ కాపాడటమే మానవత్వం అన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. మారిషస్ లో డోడో పక్షులు వేటాడి తినడం వల్ల డోడో పక్షి పుట్టుక ఆగి పోయింది అని వివరించారు. మనిషి జీవులు గూడు నేయలేదని, భూమి మీద ఉన్న జీవుల గూడు లో మనిషి ఒక భాగం మాత్రమే అనె ముఖ్యాంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి సమస్త జీవులు రక్షణకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఎస్ వి గోవింద రావు, అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ పవర్ సంస్థ ప్రతినిధి నిమ్మకాయల భాస్కర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ఇంటెర్న్ షిప్ విద్యార్ధిని నందిని రోహిత్, ఎన్ ఎస్ ఐ ఆర్ టి విద్యార్థులు పాల్గొన్నారు. గోవర్ధన పురం గోశాల ప్రతినిధి దొడ్డ మహేష్ అందజేసిన పిచ్చుకల గూళ్ళు, మట్టి పాత్రలు విద్యార్థులకు పంపిణీ చేశారు.


