Home UncategorizedVizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.

Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.

by Deva Trinadh Rao

You may also like

Leave a Comment